బిగ్ బ్రేకింగ్ : కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే భేటీ..! పార్టీ మార‌నున్నారా!?

0
115

టీ.కాంగ్రెస్ నుంచి జంపింగ్‌కు మ‌రో ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు. అందులో భాగంగానే ఆయ‌న ఇప్ప‌టికే టీఆర్ఎస్ అగ్ర నేత‌తో మాట్లాడిన‌ట్టు స‌మాచారం. అయితే ఆయ‌న ఒక‌టి రెండు రోజుల్లో త‌న నిర్ణ‌యాన్ని చెప్ప‌నున్న‌ట్టు స‌మాచారం. టీఆర్ఎస్ అగ్ర నేతతో పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడిన‌ట్టు ఆయ‌న స‌న్నిహిత‌వ‌ర్గాలు కూడా ధృవీక‌రిస్తున్నాయి.

అంతేకాకుండా చేవెళ్ల ఎంపీ స్థానానికి కాంగ్రెస్ నుంచి పోటీచేసిన కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి ఓట‌మితో ఆయ‌న పార్టీని వీడాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రోప‌క్క తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల‌న్నీ కూడా పెడింగ్‌లో ఉన్నాయి. ఆ ప‌నుల‌కు సంబంధించి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ నేత‌తో ఫోన్‌లో మాట్లాడిన‌ట్టు స‌మాచారం. అలాగే మ‌రొక గంట సేప‌ట్లో ఆయ‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్ వేదిక‌గా కేసీఆర్‌ను క‌ల‌వ‌బోతున్నారు. దీంతో ఆయ‌న కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేర‌నున్నార‌న్న గుస‌గుస‌లు రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి విన‌వ‌స్తున్నాయి.