కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ‌..!

0
34

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ ఐటీవో ప్రాంగణంలో ఉన్న కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. పదేళ్లుగా పత్రికను నపడం లేదని లీజ్ నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య కార్యకలాపాలకు వాడుతున్నారని ఆరోపించిన కేంద్రం ఆఫీసు ఖాళీచేయకపోతే ఆక్రమణదారుల చట్టంకింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

దీంతో నేషనల్ హెరాల్డ్ పత్రికను ముద్రించే అసోసియేట్ జనల్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఆ కేసుకు సంబంధించి ఇవాళ హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. నవజీవన్ నేషనల్ హెరాల్డ్ ఆదివారం ముద్రిత సంచికలు ఢిల్లీ ఐటీవో ప్రాంగణం నుంచే ప్రింట్ అవుతున్నాయని చెప్పినా ఆ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. భవనాన్ని ఖాళీ చేయాల్సిందేనని ఆదేశాలు ఇచ్చింది.