వైసీపీకి సోనియా గాంధీ లేఖ‌..! నిజ‌మెంత‌..?

0
67

సార్వత్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం కేంద్రంలో హంగ్ ఏర్పడ‌నుందంటూ ప్ర‌ముఖ సంస్థ‌ల స‌ర్వే ఏజెన్సీలు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తు కోసం జాతీయ స్థాయి ప్ర‌ధాన పార్టీలు వెంప‌ర్లాడుతున్నాయి. అందులోను, అధికారంలోకి రాబోయేది తామేనంటూ ధీమా వ్య‌క్తం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ఇరు పార్టీలు కూడా ముందు జాగ్ర‌త్త‌గా ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తు కోసం ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలను ముమ్మ‌రం చేశాయి.

ఆ క్ర‌మంలోనే గ‌తంలో త‌మ పార్టీలో ఉండి, ప్ర‌స్తుతం ప్రాంతీయ పార్టీల్లో ప్ర‌ధానంగా వ్య‌వ‌హ‌రిస్తున్న రాజ‌కీయ నేత‌ల‌తో కాంగ్రెస్ అధిష్టానం ట‌చ్‌లోకి వెళ్లింది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు సైతం రంగంలోకి దిగారు. అందులో మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఉన్న‌ట్టు ప‌లు ప్ర‌ధాన ప‌త్రిక‌లు సైతం క‌థ‌నాలను ప్ర‌చురించిన సంగ‌తి విధిత‌మే.

తాజాగా, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి లేఖ రాశార‌ని ఓ ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక త‌న ఫ్రెంట్ పేజీలో క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఈ నెల 23న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో, అదే రోజున ఢిల్లీ వేదిక‌గా జర‌గ‌నున్న బీజేపీయేత‌ర ప‌క్షాల సమావేశానికి హాజ‌రు కావాలంటూ వైఎస్ జ‌గ‌న్‌కు సోనియా గాంధీ లేఖ రాశార‌ని ఆ క‌థ‌నం పేర్కొంది. మ‌రి ఇందులో నిజ‌మెంత‌..? అన్న ప్ర‌శ్న‌కు సంబంధించి అటు వైసీపీ నుంచి కానీ, ఇటు కాంగ్రెస్ నుంచి కానీ వారి వారి పార్టీ నేత‌లు స్పందించాల్సి ఉంది.