మిలియన్ వ్యూస్ కోసం నన్నుచంపేస్తారా..! సునీల్

0
76
actor sunil serious on his death news

సునీల్ హీరో గా, కమెడియన్ గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. తాజాగా సునీల్ నటించిన చిత్రలహరి థియేటర్స్ లలో ఉంది. చిత్రలహరి హిట్ కారణంగా సునీల్ ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ కి హాజరయ్యారు. ఆ మధ్య సునీల్ యాక్సిడెంట్ లో చనిపోయాడంటూ రూమర్స్ రావడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ లో చిత్ర విశేషాలతో పాటు, తాను మరణించినట్లు వచ్చిన పుకార్ల మీద సునీల్ మాటాడారు.

సునీల్ స్పందిస్తూ… ” సోషల్ మీడియా కారణాల వలన పరిస్థితులు మరి దారుణంగా మారాయి. గత కొన్ని రోజుల ముందు వెబ్ సైట్ వారు..  యూట్యూబ్ వారు.. రోడ్డు యాక్సిడెంట్ లో నేను మరణించానని ప్రచారం చేశారు. ఈ వార్త కారణంగా వాళ్లకు మిలియన్ వ్యూస్ దక్కాయి. కేవలం మిలియన్ వ్యూస్ ల కోసం నన్ను ఎలా చంపుతారు? ఈ విధమైన వార్తల కారణంగా ఇంట్లో వారంతా ఎంత ఖంగారు పడతారు.. బాధపడతారు.. గ్రహించలేరా? ఈ వార్త రాసిన వారి కుటుంబీకుల మీద, ఇలాంటి వార్తే వస్తే అప్పుడు ఆ భాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. రాసె వార్తల్లో నిజనిజాలేంటో తెలిసి రాయాలి” అంటూ ఆగ్రహానికి గురయ్యారు.

ఇదిలా ఉండగా మెగా స్టార్ చిరంజీవి చిత్రలహరి సినిమాను చూసి నటీనటులకు, నిర్మాతకు, దేవిశ్రీ ప్రసాద్ , దర్శకులకు చిత్ర యూనిట్ అందరికి కంగ్రాట్స్ చెప్పుకొచ్చారు. ఈ పరంగా తన ట్విట్టర్లో సునీల్ థ్యాంక్స్ అన్నయ్య అంటూ చిరంజీవికి తెలియ చేశారు.