కలెక్టర్ కి హ్యాట్సాఫ్

0
155

దేశం లో ఇప్పటికి ఎవరు చేయలేని పని చేసిన కలెక్టర్…

ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి. ప్రభుత్వ పథకాలు కావాలి. కానీ ప్రభుత్వ పాఠశాలలు వద్దు. అనుకునే వారికీ చెంప చెల్లు మనిపించింది కలెక్టర్.

ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల కన్నా ప్రైవేట్ పాఠశాలల పైనే మక్కువ చూపిస్తున్న రోజులివి. ఆకరికి ప్రభుత్వ ఉపాద్యాయులు కూడా వారి పిల్లలను, ప్రైవేట్ స్కూల్స్ కు పంపడం  గమనార్హం. ఈరోజుల్లో అందరు ప్రభుత్వ పాఠశాలలు అనగానే కనీస  విద్య,మౌలిక  సదుపాయాలు కూడా లేవని భావించే వారికీ, కొన్ని వెల కోట్లు  గవర్నమెంట్ స్కూల్ ల  విద్య కోసం  ప్రభుత్వం వెచ్చిస్తుంది.. ఈ విషయాన్నే  అందరికి తెలియచేయాలనుకుని, తన కూతుర్ని అంగన్వాడీ  బడిలో వేసిన వైనముకి మనమందరం సెల్యూట్ చేయాల్సిందే. ఇపుడు సోషల్ మీడియాలో కలెక్టర్ నిర్ణయాన్ని అందరు అబినందించడమే  కాకుండా ఆదర్శముగా తీసుకుంటున్నారు.

తమిళనాడు లోని తిరునల్వేలి జిల్లాకి ఆమె కలెక్టర్. మంచి ఉద్యోగం,మంచి సంపాదన ఐన కూడా శిల్ప తన కూతురిని అంగన్ వాడికి పంపిస్తుంది. ప్రభుత్వం పాఠశాలలో తన కూతురికి అన్ని మౌలిక  సదుపాయాలు ఉన్నాయని, విద్య  కూడా బాగుంటుందని  ప్రజలతో పాటు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా తెలియ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలంటే  చిన్న చూపు చూస్తున్న వారికీ  గుణపాఠం చెప్పింది.

ఇక కలెక్టర్ గారి మాటల్లో  చూస్తే ” ప్రభుత్వ ఉపాధ్యాయులు  చాలా శిక్షణ పొంది ఉన్నారని ,పిల్లలను ఆడించడం ,చదివించడం  అన్ని నాకూతురు నేర్చుకోవాలంటే, ప్రభుత్వం నడిపే అంగన్వాడిలు సరి అయినవి అని, అంతేకాకుండా తన కూతురు అందరిలాంటి అమ్మాయే అని, ఇలా కూతుర్ని అంగన్వాడీ లో చేర్పించినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది”.

ఇకనైనా ప్రభుత్వ స్కూళ్ళ  మీద ఉన్న అభిప్రాయం ప్రజలలో మార్పు తెస్తుందని ఆశిస్తూ…
కలెక్టర్ కి  హ్యాట్సాఫ్