చంద్రగిరి రీ పోలింగ్ రచ్చ : ఈసీ సమాధానంతో టీడీపీ తీవ్ర ఆగ్రహం

0
64
చంద్రగిరి రీ పోలింగ్ రచ్చ : ఈసీ సమాధానంతో టీడీపీ తీవ్ర ఆగ్రహం
చంద్రగిరి రీ పోలింగ్ రచ్చ : ఈసీ సమాధానంతో టీడీపీ తీవ్ర ఆగ్రహం

చంద్రగిరిలో రీ పోలింగ్ రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎలాంటి పిర్యాదులు లేకపోయిన.. TDP బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే రీ పోలింగ్ నిర్వహిస్తుండడంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఈసీని కలిసిన TDP నేతలు CM రమేష్, కంభంపాటిలు ఎన్నికల సంఘం సమాధానంవిని ఆగ్రహానికి లోనయ్యారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడా పిర్యాదులు లేవు.. పిర్యాదులు లేకుండానే ఈసీ రీ పోలింగ్ కి ఆదేశాలిచ్చింది. అదికూడా టీడీపీ బలంగా ఉన్న ఐదు బూత్ లలోనే రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు.. BJP ఎలా చెబితే ఈసీ అలా వ్యవహరిస్తుంది అంటూ సీఎం రమేష్  ఎన్నికల సంఘం తీరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.