ఆ ఆల‌యానికి రూ.100 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్‌..!

0
178

గోదావ‌రి న‌దీతీరంలో ఉన్న కాళేశ్వ‌ర, ముక్తేశ్వ‌ర‌స్వామి ఆల‌యానికి వెంట‌నే రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. కాగా, సీఎం కేసీఆర్‌ ఈ రోజు కుటుంబ స‌మేతంగా ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి కాలేశ్వ‌రం ప్రాజెక్టు ప‌నులను ప‌రిశీలించారు. అనంత‌రం కాళేశ్వ‌ర, ముక్తేశ్వ‌ర‌స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఆల‌య అర్చ‌కుల‌తో మాట్లాడారు. అర్చ‌కుల కోసం క్వార్ట‌ర్స్ నిర్మిస్తామ‌ని, వేద పాఠ‌శాల‌, క‌ళాశాల‌తో కూడిన ఇంటెగ్రేటెడ్ కాంప్లెక్స్‌ల‌ను నిర్మిస్తామ‌ని సీఎం కేసీఆర్ చెప్పారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రాంతాన్ని గొప్ప ప‌ర్యాట‌క కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సంక‌ల్పం ప్ర‌భుత్వానికి ఉంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. గోదావ‌రి పుష్క‌ర ఘాట్ల వ‌ద్ద ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా జాలీలు ఏర్పాటు చేసి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. అనంత‌రం కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల ప్రాజెక్టులో భాగ‌మైన మేడిగ‌డ్డ బ్యారేజ్‌కు కేసీఆర్ చేరుకున్నారు. బ్యారేజ్‌, గేట్ల బిగింపు, క‌ర‌క‌ట్ట‌ల నిర్మాణం, రివిట్‌మెంట్ ప‌నుల పురోగ‌తిపై ఆయ‌న సాగునీటిశాఖ ఇంజినీర్ల‌తో స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు.