తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరికొద్ది సేపట్లో తన సొంత గ్రామం చింతమడకలో పర్యటించున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో చింతమడకలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ వెంకటరామిరెడ్డి ఇతర జిల్లాల అధికారిక యంత్రాంతగంతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
సీఎం కేసీఆర్ సమావేశానికి దాదాపుగా 3వేల మంది గ్రామస్తులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గ్రామస్తులకు గులాబీరంగు ఐడెంటిటీ కార్డును అధికారులు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ తన పర్యటనలో భాగంగా సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం గ్రామ శివార్లలో బాలికల పాఠశాల భవన నిర్మాణం కోసం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఆ తరువాత ఆ ప్రాంత ప్రజలతో కలిసి కేసీఆర్ సహపంక్తి భోజనాలు చేయనున్నారు.