సీఎం కేసీఆర్ : అలా చేస్తే కూల‌గొట్టుడే..!

0
167

ఎవ‌రైనా అక్ర‌మ నిర్మాణాలు చేప‌డితే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉపేక్షించ‌మ‌ని, ఎంత‌టివారైనా వారు నిర్మించిన అక్ర‌మ క‌ట్ట‌డాన్ని కూల‌గొడ‌తామంటూ తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు అన్నారు. కాగా, మున్సిపాలిటీ బిల్లు -2019పై తెలంగాణ అసెంబ్లీలో చ‌ర్చ కొన‌సాగుతున్న సంగతి తెలిసిందే.

అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చ‌డంలో ఎవ‌రి పైర‌వీలు, పెత్త‌నం ఇక న‌డ‌వ‌ద‌ని, ఆగ‌స్టు 15 నుంచి త‌న అస‌లు ప‌రిపాల‌న చూస్తారంటూ సీఎం కేసీఆర్ అన్నారు. నిర్మాణాల అనుమ‌తుల విష‌యంలో అల‌క్ష్యం చేస్తే అధికారుల‌కు భారీ జ‌రిమానాలు ఉంటాయ‌న్నారు. నిర్ణీత స‌మ‌యంలో అనుమ‌తులు రాకుంటే.. అనుమ‌తులు వ‌చ్చిన‌ట్టు భావించి నిర్మాణాలు చేప‌ట్టొచ్చ‌ని కేసీఆర్ తెలిపారు.

అలాగే, 75. చ‌.గ‌. ఉన్న పేద‌ల‌కు జీ+1 వ‌ర‌కు అనుమ‌తి అవ‌స‌రం లేద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. కానీ మున్సిపాలిటీల్లో మాత్రం రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంద‌న్నారు. జిల్లాల క‌లెక్ట‌ర్‌ల‌కు విశేష అధికారాలు ఉండేలా మున్సిపాలిటీ బిల్లు -2019లో పొందుప‌రిచామ‌ని, కొత్త చ‌ట్టం వ‌స్తే 128 మున్సిపాలిటీలు, 13 మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు ఏర్ప‌డ‌నున్నాయ‌న్నారు.