TDP నేత మండవ వేంకటేశ్వర రావు ఇంటికెళ్ళిన KCR : TRSలోకి ఆహ్వానం..!

0
187
TDP నేత మండవ వేంకటేశ్వర రావు ఇంటికెళ్ళిన KCR : TRSలోకి ఆహ్వానం..!
TDP నేత మండవ వేంకటేశ్వర రావు ఇంటికెళ్ళిన KCR : TRSలోకి ఆహ్వానం..!

తెలంగాణ రాష్ట్రంలో TRS తప్ప మరో పార్టీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే.. నిన్నటివరకు కాంగ్రెస్ కొంత గట్టి పోటీ ఇచ్చినా.. ఇప్పుడు కాంగ్రెస్ ను కూడా కాలి చేశారు ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్. ఇక తెలంగాణ TDPలో అయితే గత 5 ఏళ్లుగా సారైనా నాయకుడే లేడు. 2014 ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో TDP పార్టీని కాలిచేసింది TSR పార్టీ. తరువాత ఒకరిద్దరు ఉన్న వాళ్ళవల్ల కే‌సి‌ఆర్ కి పెద్దగా నష్టం కలగలేదు. లాంటి TDPలో చిట్ట చివరి మిగిలిన నిజామాబాద్ TDP నేత “మండవ వేంకటేశ్వర రావు”ను కూడా TRSలోకి ఆహ్వానించారు కే‌సి‌ఆర్.

ఇక్కడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అందరిలా పార్టీ కండువా కప్పి పార్టీలో తీసుకోకుండా.. స్వయంగా ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ గారే మండవ వేంకటేశ్వర రావు గారి ఇంటికెళ్ళి మరీ ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. నిజానికి మండవ వేంకటేశ్వర రావు, కే‌సి‌ఆర్ ఇద్దరు మంచి స్నేహితులనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాలు విడిపోకముందు ఈ ఇద్దరు నేతలు కలిసి TDPలో పనిచేశారు. ఆరోజు నుండి వీరిమద్య ఇంకా సాన్నిహిత్య సంబందాలు కొనసాగుతూనే ఉన్నాయి. అందులో బాగంగానే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆయన ఇంటికి వెళ్లరు.

Read Also: బ్రేకింగ్ న్యూస్ : 10కోట్లతో పట్టుబడ్డ రాజాం YSRCP నాయకులు..!