ఏపీ మంత్రుల‌కు సీఎం జ‌గ‌న్ వార్నింగ్‌…!

0
168

అవును, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర మంత్రుల‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ విష‌యాన్ని రవాణా, పౌరసంబంధాలశాఖ మంత్రి పేర్ని నాని మీడియా స‌మావేశంలో భాగంగా వెల్ల‌డించారు. కేబినేట్ స‌మావేశంలో జ‌రిగిన చ‌ర్చ‌ల శారాంశాన్ని చెప్పుకొచ్చిన పేర్ని నాని జ‌గ‌న్ మాట‌ల‌ను మీడియా ప్ర‌తినిధుల‌కు తెలిపారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అవినీతి ర‌హిత స‌మాజాన్ని కోరుతూ ఈ ద‌ఫా జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు ప‌ట్టం క‌ట్టార‌ని, ఆ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందంటూ జ‌గ‌న్ చెప్పార‌ని మంత్రి వెల్ల‌డించారు. ప్ర‌జ‌ల ముఖ్య ఉద్దేశం ముఖ్య‌మంత్రి స్థాయి నుంచి గ్రామ స్థాయిలోని అధికారి వ‌ర‌కు అవినీతి లేని రాష్ట్రం కావాల‌ని జ‌గ‌న్ తెలిపార‌న్నారు.

కాబ‌ట్టి తాను ఏర్పాటు చేసుకున్న ఏ మంత్రి అయినా స‌రే ఎటువంటి పొర‌పాటు చేసినా, ఎవరిమీద‌నైనా అవినీతి ఆరోప‌న‌లు వ‌చ్చినా త‌క్ష‌ణం విచారించి మ‌రు నిముషం సస్పెండ్ చేస్తాన‌ని జ‌గ‌న్ సందేశం ఇచ్చార‌ని మంత్రి పేర్ని నాని చెప్పారు.