సీఎం జగన్ రోజూ ధరించే షర్ట్స్ రేట్ ఎంతో తెలుసా..?

0
2397

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పేరు ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోను టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. గ‌త ప్ర‌భుత్వాలు చేప‌ట్ట‌ని ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేసే క్ర‌మంలో జ‌గ‌న్ తీసుకుంటున్న ప్ర‌తి నిర్ణ‌యం కూడా సంచ‌ల‌నంగా మారుతోంది. చంద్ర‌బాబు ఇంటి విష‌యం, ఉండ‌వ‌ల్లి క‌ర‌క‌ట్ట‌ల‌పై అక్ర‌మ నిర్మాణాల సంగతి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఇదిలా ఉండ‌గా, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై తాజాగా ఓ ఆస‌క్తిక‌ర చ‌ర్చ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సాగుతోంది. సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి నేటి వ‌ర‌కు కూడా ప్ర‌జాపాల‌న‌పై దృష్టిపెట్టిన వైఎస్ జ‌గ‌న్ నిత్యం అధికారుల‌తో కీల‌క స‌మావేశాలు నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ముఖంలో కించిత్త‌యినా ఆల‌స‌ట, కోపం అనేది కన‌ప‌డ‌దు. ఎప్పుడూ న‌వ్వుతూనే క‌న‌ప‌డుతుంటారు. ఇలా నిత్యం ఫ్రెష్‌గా క‌న‌ప‌డేందుకు జ‌గ‌న్ తీసుకుంటున్న ఆహారం ఏమిటో..? అంటూ కొంత‌మందికి ఎప్ప‌ట్నుంచో అనుమానం వ‌చ్చి ఉంటుంది.

అయితే జ‌గన్ తీసుకుంటున్న ఆహారంతోపాటు ఆయ‌న ధ‌రించే వైట్‌ష‌ర్ట్‌పై కూడా ప‌లు సోష‌ల్ మీడియాల‌లో ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ష‌ర్ట్ ఇత‌ర రాజ‌కీయ నాయ‌కులు ధ‌రించే మాదిరి క‌ద్ద‌ర్ మాత్రం కాదు. ఈ క‌ద్ద‌ర్ ఎప్పుడూ త‌ళ‌త‌ళ‌లాడుతూ ఉంటుంది. ఏ మాత్రం న‌ల‌గ‌కుండా స్టిఫ్‌గా ఉంటూ జ‌గ‌న్ ప‌ర్స‌నాలిటీని మ‌రింత ఇనుమ‌డింప చేస్తుంది. ఇంత‌కీ స‌ద‌రు ష‌ర్టు ఏమిటి అని ఆరా తీస్తే మాత్రం కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిశాయి.

కాగా, సీఎం వైఎస్ జ‌గ‌న్ ధ‌రించే ష‌ర్టు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫేమ‌స్ బ్రాండ్ పోలో రాల్ప్‌కు చెందిన‌దిగా తెలుస్తుంది. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కాక ముందు నుంచి ఇదే బ్రాండ్ దుస్తుల‌ను ఇష్ట‌ప‌డేవారు. అంతేకాకుండా, ఒక్కో ష‌ర్టు ప్రారంభ ధ‌ర రూ.8వేలు ఉంటుంది. మ‌రికొన్ని రూ.12వేల ధ‌ర ప‌లుకుతాయి. ఈ త‌ర‌హా ష‌ర్టులు మంచి స్ట‌యిల్‌ను క్యారీ చేస్తాయి. ష‌ర్టు క్వాలిటీతోపాటు కాస్ట్లీ అన్నవిష‌యం చూడ‌గానే ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. ఆ కార‌ణంగానే సీఎం జ‌గ‌న్ ఈ బ్రాండ్‌ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తార‌ని స‌న్నిహితులు చెబుతున్నారు.