జ‌గ‌న్ సీఎం హోదాలో తొలిసారి..!

0
81

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మ‌రికొద్ది సేప‌ట్లో పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించ‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా విజ‌య‌వాడ నుంచి హెలికాప్ట‌ర్‌లో బ‌య‌ల్దేర‌నున్న జ‌గ‌న్ ముందుగా ఉండి చేరుకుంటారు.

ఉండిలో జ‌రుగుతున్న వైసీపీ నేత‌ కొయ్యె మోషేన్‌రాజు కుమారుడి వివాహానికి జ‌గ‌న్ హాజ‌రై వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించ‌నున్నారు. అనంత‌రం 11:25 గంట‌ల‌కు పోల‌వ‌రం చేరుకుని ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రిశీలిస్తారు. అధికారులు, కాంట్రాక్ట‌ర్ల‌తో స‌మావేశ‌మై ప్రాజెక్టుపై స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు తిరిగి విజ‌య‌వాడ బ‌య‌ల్దేర‌నున్నారు వైఎస్ జ‌గ‌న్‌.