సీఎం జ‌గ‌న్ : ఎంపీల‌కు మ‌రోమారు స‌ల‌హాలు – సూచ‌న‌లు..!

0
149

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ సిద్ధ‌మ‌వుతోంది. దీనిలో భాగంగా ఢిల్లీ వేదిక‌గా వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం మ‌రికొద్దిసేప‌ట్లో ప్రారంభం కానుంది. ఆ పార్టీ అధ్య‌క్షుడు, సీఎం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గ‌నున్న ఈ స‌మావేశానికి 22 మంది ఎంపీలు, ఇద్ద‌రు రాజ్య‌స‌భ స‌భ్యులు హాజ‌రుకానున్నారు.

కాగా, ఏపీకి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల అమ‌లు, కేంద్రం నుంచి నిధులు సాధించ‌డం వంటి అంశాలపై పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల్లో డిమాండ్ చేసేందుకు వైసీపీ వ్యూహం సిద్ధం చేసుకుంది. ఈ రోజు జ‌ర‌గనున్న స‌మావేశంలో ఇవే అంశాల‌పై సీఎం జ‌గ‌న్ ఎంపీల‌కు దిశా నిర్దేశం చేయ‌నున్నారు.

అలాగే ప్ర‌సంగాల స‌మ‌యంలో ఏఏ అంశాల‌ను ప్ర‌సంగించాల‌ని, వేటిపై ఎలా మాట్లాడాలి అన్న అంశాల‌పై సీఎం జ‌గ‌న్ వివ‌రించ‌నున్నారు. రైల్వే జోన్‌, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రెవెన్యూ సంబంధిత విష‌యాల‌పై ఎలా స్పందించాల‌న్న అంశాల‌పై సీఎం జ‌గ‌న్ ఎంపీల‌కు సూచ‌న‌లు ఇవ్వ‌నున్నారు.