ప్ర‌తి త‌ల్లిదండ్రుల‌కు రూ.15,000 పంపిణీ : సీఎం జ‌గ‌న్‌

0
167

ప్ర‌తి ఒక్క త‌ల్లిదండ్రుల పిల్ల‌లు వారి వారి జీవితాల్లో ఉన్న‌త స్థితికి చేరుకోవాల‌న్న‌దే త‌న త‌న ఆశ‌, కోరిక అని ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అన్నారు. కాగా, ఈ రోజు తాడేప‌ల్లి మండ‌ల ప‌రిధిలోగ‌ల పెనుమాక జ‌డ్పీ పాఠ‌శాల‌లో జ‌రిగిన రాజ‌న్న బ‌డిబాట కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సీఎం జ‌గ‌న్ విద్యార్థుల‌తో అక్ష‌రాభ్యాసం చేయించారు.

జ‌గ‌న్ మాట్లాడుతూ విద్యార్థుల చ‌దువు కోసం ఏ కుటుంబం అప్పుల‌పాలుకాకూడ‌ద‌న్న ఉద్దేశంతో పాద‌యాత్ర‌లో భాగంగా తాను ఇచ్చిన హామీ మేర‌కు ప్ర‌తి ఒక్క త‌ల్లిదండ్రుల‌కు రూ.15,000లు వంతున వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 26 నుంచి అంద‌జేస్తామ‌ని తెలిపారు.

రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభం కాగానే పాఠ్య‌పుస్త‌కాలు, యూనిఫామ్‌లు ఇవ్వాల‌ని.., ఏప్రిల్, మే నెల‌ల్లోనే స్కూళ్ల‌కు పుస్త‌కాలు చేరాల‌ని సంబంధిత అధికారుల‌ను జ‌గ‌న్ ఆదేశించారు. ప్ర‌తి ప్ర‌భుత్వ స్కూల్‌కు ప్ర‌భుత్వం త‌రుపున ఇన్‌ఫ్ట్రాస్ట్ర‌క్చ‌ర్ క‌ల్పిస్తామ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు.