మ‌హిళ‌ల కోసం సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణయం..!

0
195

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. 2020 ఉగాది పండుగ ప‌ర్వ‌దినం నాటికి రాష్ట్ర మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పే దిశ‌గా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్ప‌టి నుంచే అడుగులు వేస్తోంది. అందుకు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇంత‌కీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న ఆ సంచ‌ల‌న నిర్ణ‌యం ఏమిట‌న్న అస‌లు విషయానికి సంబంధించి రవాణా, పౌరసంబంధాలశాఖ మంత్రి పేర్ని నాని మీడియా స‌మావేశంలో భాగంగా వెల్ల‌డించారు.

పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇంటి స్థ‌లంలేని, అర్హ‌త క‌లిగిన మ‌హిళ‌ల‌ను గుర్తించి వారి పేరు మీద ప్ర‌భుత్వ నిధుల‌తో కొనుగోలు చేసిన స్థ‌లాల‌ను పంపిణీ చేస్తుంద‌ని తెలిపారు. ప్ర‌భుత్వం పంపిణీ చేసిన ఇళ్ల స్థ‌లాల‌పై బ్యాంకు రుణాలు తీసుకునేందుకు అవ‌కాశాలు ఉంటాయ‌ని తెలిపారు. సీఎం జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌చ్చే ఏడాది ఉగాది రోజున అమ‌లు కానుంద‌ని మంత్రి పేర్ని నాని తెలిపారు.