ఏపీ టూరిజం అంబాసిడ‌ర్‌గా ఎన్టీఆర్‌..?

0
1652

ఈ ద‌ఫా జ‌రిగిన ఎన్నిక‌ల వేళ తాము అధికారంలోకి వ‌స్తే ద‌శ‌ల వారీగా మ‌ద్య‌పాన నిషేధం అమ‌లు చేస్తామ‌ని వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇదే అంశాన్ని జ‌గ‌న్ పార్టీ త‌న మేనిఫెస్టోలో పేర్కొంది. అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం ముందుగా త‌మ మేనిఫెస్టోలో తెలిపిన విధంగా తొలి ద‌శ‌లో భాగంగా కొన్ని బెల్టుషాపుల‌ను ర‌ద్దు చేశారు.

ఇదే స‌మ‌యంలో మ‌ద్య‌పాన నిషేధానికి, అలాగే ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా టాలీవుడ్ న‌ట‌రుద్రుడు ఎన్టీఆర్‌ను నియ‌మించే ఆల‌చ‌న‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉన్న‌ట్టు సోష‌ల్ మీడియాల్లో క‌థ‌నాలు వైర‌ల్‌గా మారాయి. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీతో అంటీముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించిన ఎన్టీఆర్ సీఎం జ‌గ‌న్‌తో క‌లిసి ప‌నిచేయ‌బోతున్నాడ‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

కాగా, జూ.ఎన్టీఆర్‌కు అత్యంత స‌న్నిహితుల్లో ఒక‌రైన కొడాలి నాని ప్ర‌స్తుతం జ‌గ‌న్ కేబినేట్‌లో మంత్రిగా ఉన్నారు. అలాగే ఎన్టీఆర్‌కు పిల్ల‌నిచ్చిన మామ నార్నె శ్రీ‌నివాస‌రావు కూడా వైసీపీలోనే కొన‌సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌ద్య‌పాన నిషేధం, టూరిజం అంబాసిడ‌ర్‌గా జూ.ఎన్టీఆర్‌ను నియ‌మించేందుకు జ‌రిపే సంప్ర‌దింపుల్లో భాగంగా మంత్రి కొడాలి నాని కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌నున్నార‌న్న క‌థ‌నం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.