సీఎం జ‌గ‌న్ ఫుల్ ప‌ర్మీష‌న్‌.. అలా చేస్తే చెంప ప‌గ‌ల‌గొట్టుడే..!

0
171

విద్యార్థినుల్లో, మ‌హిళ‌ల్లో ఆత్మ‌స్థైర్యాన్ని నింపేందుకు ఏబీవీపీ, విద్యానిధి స్వ‌చ్ఛంద సంస్థ‌లు సంయుక్తంగా మిష‌న్ సాహ‌సి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న సంగతి తెలిసిందే. కేవ‌లం ప‌ట్ట‌ణాల్లోనే కాకుండా, గ్రామ స్థాయిల్లో, ప్ర‌తి పాఠ‌శాల‌, క‌ళాశాల‌ల్లో ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌బ‌డుతోంది. అందులో భాగంగా న‌గ‌రి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో జ‌రిగిన మిష‌న్ సాహ‌సి కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే రోజా పాల్గొని మాట్లాడారు.

దేశ వ్యాప్తంగా విద్యార్థినుల్లో, మ‌హిళ‌ల్లో ఆత్మ‌స్థైర్యాన్ని నింపే విధంగా మిష‌న్ సాహ‌సి కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం సంతోష‌క‌ర‌మ‌ని రోజా అన్నారు. మిష‌న్ సాహ‌సితో స‌త్ఫ‌లితాలు ఉంటాయ‌ని తాను భావిస్తున్నానన్నారు. ఆడ పిల్ల అంటే అగ్గిపుల్ల అని, వెలిగితే దేన్నైనా ద‌హించ‌గ‌ల‌ద‌న్నారు.

ఆడ పిల్ల‌ను రాంగ్‌సైడ్ గోకినోడికి కూడా అలానే ఉంటుంద‌న్న‌ది ప్ర‌తి ఒక్క‌రు తెలియ‌జేయాల‌న్నారు. ఒక ఆక‌తాయి ఆడ పిల్ల‌ల‌ను ఒక మాట అన్నా.. పైట లాగినా, గిల్లాల‌ని ఆలోచ‌న వ‌చ్చినా అటువంటి వాడి మ‌క్కెలు ఇర‌గ్గొట్టాల‌న్నారు. మిష‌న్ సాహ‌సితో ప్ర‌తి ఒక్క‌రు స్ట్రాంగ్ అవ్వాల‌ని పిలుపునిచ్చారు. ల‌క్ష్యం పెద్ద‌దిగా ఉన్న‌ప్పుడే ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించ‌గలుగుతామ‌న్నారు.

అయితే, న‌గ‌రి ఎమ్మెల్యే రోజా అన్నారు. వైసీపీ టికెట్‌పై రెండోసారి న‌గ‌రి శాస‌న స‌భ్యురాలిగా గెలుపొందిన రోజాకు సీఎం జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి కేటాయించ‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ భావించినా అది జ‌ర‌గ‌లేదు. రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల్లో భాగంగా రెండున్న‌రేళ్ల త‌రువాత జ‌ర‌గ‌నున్న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో రోజాకు ప్లేస్ క‌న్ఫామ్ అంటూ ఆ పార్టీవ‌ర్గాలు చెప్పుకొస్తున్నాయి.

ఎమ్మెల్యే రోజా మాత్రం ఎప్ప‌టిలానే త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. ప్ర‌జ‌ల‌ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం నిత్యం కృషి చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకుంటున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నియోజ‌క‌వ‌ర్గంలోని ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు వెళ్లిన రోజా, పాఠ‌శాల అభివృద్ధికి కావాల్సిన సౌక‌ర్యాల‌ను సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారు.

జీవితంలో ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించేలా పెద్ద ల‌క్ష్యాల‌ను పెట్టుకుని, వాటిని సాధించేందుకు ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రుల స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవాల‌న్నారు. కేవ‌లం డాక్ట‌ర్‌, క‌లెక్ట‌ర్‌గానే కాకుండా పొలిటీసియ‌న్‌, యాక్ట‌ర్‌గా కూడా ల‌క్ష్యాల‌ను పెట్టుకోవ‌చ్చ‌ని, ఆ దిశ‌గా ప‌య‌నిస్తే విజ‌యాలు సాధిస్తార‌ని రోజా అన్నారు. చ‌ట్టాల‌ను అమ‌లు చేసే స్థాయికి మ‌రింత మంది మ‌హిళ‌లు రావాల‌ని తాను ఆశిస్తున్నాన‌ని రోజా చెప్ప‌డం గ‌మ‌నార్హం.