రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

0
142

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు కుటుంబాల‌కు ఇక‌పై రూ.7 ల‌క్ష‌ల ప‌రిహారం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఆ ప‌రిహారం మ‌రొక‌రి చేతిలోకి వెళ్ల‌కుండా కొత్త చ‌ట్టం తేవాల‌ని డిసైడ్ చేశారు. అంతేకాకుండా గ‌త ఐదేళ్ల‌కాలంలో త‌క్కువ‌చేసి చూపిన రైతు ఆత్మ‌హ‌త్య‌ల లెక్క‌ల‌ను మ‌రోసారి ప‌రిశీలించాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు.

మ‌రోవైపు ఇక‌పై రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకోని విధంగా అధికారుల తీరు ఉండాల‌ని సీఎం జ‌గ‌న్ సూచించారు. ప్ర‌స్తుతం ప‌రిహారం రాగానే అప్పులు ఇచ్చిన వారు ఎగ‌రేసుకుపోతున్నార‌ని ఇక‌పై మ‌రొక‌రు దాన్ని త‌న్నుకుపోయే అవ‌కాశం లేకుండా ప‌గ‌డ్బంధీగా కొత్త‌చ‌ట్టం తీసుకువ‌స్తామ‌ని సీఎం జ‌గన్ తెలిపారు. అవినీతి నిర్మూల‌న‌కు వ్య‌వ‌స్థ మొత్తాన్ని మార్చాల‌ని జిల్లాల క‌లెక్ట‌ర్‌ల‌కు జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు.