సీఎం జ‌గ‌న్ : దేశ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా..!

0
247

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కాసేప‌టి క్రితం క‌డ‌ప గ‌డ‌ప నుంచి న‌వ‌ర‌త్నాల అమ‌లుకు శ్రీ‌కారం చుట్టారు. జమ్మ‌ల‌మ‌డుగులో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం జ‌గ‌న్ పాల్గొని మాట్లాడారు. వృద్ధుల‌కు పింఛ‌న్‌ను రూ.2,500లు పెంచామ‌ని, వృద్దుల‌కు, దివ్యాంగుల‌కు వైసీపీ ప్ర‌భుత్వ అండ‌గా ఉంటుంద‌న్నారు. రైతుల‌కు రూ.84వేల కోట్ల రుణాలు ఇవ్వ‌నున్న‌ట్లు జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

అలాగే రైతుల‌కు సున్నా వ‌డ్డీకే రుణాలు ఇచ్చేందుకు త‌మ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని సీఎం జ‌గ‌న్ వెల్ల‌డించారు. ఇప్ప‌టికే రైతుల‌కు ప‌గ‌టిపూటే తొమ్మిది గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రా జ‌రుగుతుంద‌ని, అలాగే ఆక్వా రైతుల‌కు రూ.1.50ల‌కే యూనిట్ విద్యుత్ ఇస్తున్నామ‌న్నారు. రూ.8,754 కోట్ల రుణాల‌ను రైతుల చేతుల్లో పెట్ట‌డం కేవ‌లం ఏపీ చ‌రిత్ర‌లోనే కాకుండా.. దేశ చ‌రిత్ర‌లోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా జ‌ర‌గ‌లేద‌న్నారు.