మందుబాబుల‌కిక మ‌డ‌త‌డిపోద్ది

0
241

జ‌గ‌న్ వ‌స్తాడు.. మ‌ద్యం మ‌త్తులో కునారిల్లిపోతోన్న త‌మ కుటుంబాల్ని గ‌ట్టున ప‌డేస్తాడు అని ఏపీ జ‌నం వేయిక‌ళ్ల‌తో ఎదురుచూశారు. ప్ర‌జ‌లు అనుకున్న‌ట్టుగానే జ‌గ‌న్ సీఎం అయ్యాడు. రెండురోజుల్లోనే అంటే, ఇవాళ‌ మ‌ద్య నిషేదంపై ఉన్న‌తాధికారుల‌తో ఆయ‌న‌ స‌మీక్ష నిర్వ‌హించారు. రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు.

దీనికి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో అన్వేషించాలని అధికారులకు  సూచించారు. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా కార్యాచరణ ఉండాలని చెప్పారు. బెల్టు షాపుల‌పై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తొలి విడుతలో బెల్ట్ షాపులను ఎత్తేయాలని.. బెల్ట్ షాపులను ఎత్తేయడం వల్ల ఎంత ఆదాయం తగ్గుతుందో అంచనా వేసి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

కాగా, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైతే… దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తానని జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కొత్త ముఖ్య‌మంత్రి తాజా నిర్ణ‌యంతో మందుబాబులు ప్ర‌శాంతంగా మ‌డివేసుకుని ఇంట్లో కూర్చుంటారో లేదో చూడాలి.