చంద్ర‌బాబుకు మ‌రో బిగ్ షాక్..? – సీఎం కుమార‌స్వామి నిర్ణ‌యంతో..!

0
398

దేశ వ్యాప్తంగా ఏడు విడ‌త‌లుగా జరుగుతున్న సార్వ‌త్రిక ఎన్నికల స‌ర‌ళిని నిశితంగా ప‌రిశీలించిన జాతీయ పార్టీలు హంగ్ వ‌స్తే ప‌రిస్థితి ఏంటి..? అన్న ప్ర‌శ్న‌కు సంబంధించి ఇప్ప‌టి నుంచే చ‌ర్చ‌లు ప్రారంభించాయి. అందులో భాగంగానే కేసీఆర్ మ‌ద్ద‌తుపైన కాంగ్రెస్ చాలా ఆశ‌లు పెట్టుకున్న‌ట్టు తెలుస్తుంది.

కాగా, సీఎం కేసీఆర్ ఇటీవ‌ల కాలంలో క‌ర్ణాట‌క సీఎం కుమార స్వామితో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డాన్ని కాంగ్రెస్ ప్ర‌స్తావిస్తోంది. అయితే, కుమార‌స్వామి కాంగ్రెస్ పార్టీలో భాగ‌స్వామిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ అంశాన్ని ప్ర‌స్తావిస్తున్న సీఎం కేసీఆర్ ప‌రిస్థితుల‌నుబ‌ట్టి కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నార‌న్న సంకేతాలు త‌మ‌కు అందుతున్నాయ‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు.

ఒక‌వేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్, వైసీపీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మ‌ద్ద‌తు ఇచ్చేంద‌కు సిద్ధ‌మైతే, ఇప్ప‌టికే కాంగ్రెస్ చెంత‌కు చేరిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు విష‌యంలో ఈ ఇద్ద‌రి నేత‌ల వైఖ‌రి ఎలా ఉండ‌బోతుంద‌న్న చ‌ర్చ ఇప్పుడు రాజ‌కీయ విశ్లేష‌కుల్లో కొన‌సాగుతోంది.