ఎగ్జిట్‌పోల్స్‌పై సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

0
72
Chandrababu naidu speech on Amaravathi

కేంద్ర ఎన్నిక‌ల సంఘం అనుమ‌తితో ఇటీవ‌ల ఏపీ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన కేబినేట్ స‌మావేశంలో సీఎం చంద్ర‌బాబు మంత్రుల‌కు ఓ సందేశం ఇచ్చారని, వైసీపీ, జ‌న‌సేన శ్రేణుల త‌మ‌పై దాడులు చేస్తార‌న్న భ‌యంతోనే టీడీపీకి ఓటేసిన వారెవ్వ‌రు కూడా బ‌య‌ట‌కు చెప్ప‌లేద‌ని, ఏదేమైనా టీడీపీ గ‌తంలోకంటే ఎక్కువ అసెంబ్లీ సీట్ల‌ను గెలుపొంది మ‌ళ్లీ అధికారం చేప‌ట్ట‌నుంద‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు ఓ సోష‌ల్ మీడియా పేర్కొన్న క‌థ‌నం ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

ప‌సుపు – కుంకుమ‌, వృద్ధాప్య పింఛ‌న్‌, నిరుద్యోగ భృతి, అన్నా క్యాంటీన్ ల‌బ్ధిదారుల్లో వంద‌కు 80 శాతం మంది టీడీపీకే ఓటేశార‌ని, అయితే, టీడీపీకి ఓటేశామ‌న్న విష‌యం బ‌య‌ట‌కు వెల్ల‌డిస్తే.. వైసీపీ, జ‌న‌సేన శ్రేణులు దాడులు చేస్తాయ‌న్న భ‌యంతో వారు చెప్ప‌లేద‌ని చంద్ర‌బాబు అన్నారు.

మొత్తం మీద కోటి నుంచి కోట‌న్న‌ర ఓట్లు టీడీపీకే ప‌డ్డాయి, మిగిలిన ఓట్ల‌ను జ‌న‌సేన‌, వైసీపీ ఇత‌ర పార్టీలు పంచుకున్నాయ‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు స‌మాచారం. ఏదేమైనా ఎగ్జిట్‌పోల్స్ ఫ‌లితాలు టీడీపీకి వ్య‌తిరేకంగా ఉన్నా, ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ద్ద‌ని, ఫ‌లితాలు టీడీపీకి అనుకూలంగా లేకున్నా, వ‌చ్చేది మాత్రం టీడీపీ ప్ర‌భుత్వ‌మేన‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు స‌మాచారం.