వివేకానంద‌రెడ్డి హ‌త్య : తెర‌పైకి మైనింగ్ వ్య‌వ‌హారం.. అస‌లు మేట‌ర్ ఎస్పీ మాట‌ల్లో..!

0
289

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య మిస్ట‌రీని చేదించేందుకు సిట్ అధికారుల బృందం ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేసింది. వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు సంబంధించి కేసును చేదించేందుకు ఆయ‌న ముగ్గురు సోద‌రులు భాస్క‌ర్‌రెడ్డి, ప్ర‌తాప్‌రెడ్డి, మ‌నోహ‌ర్ రెడ్డిల‌ను సిట్ అధికారుల బృందం ఆదివారం నాడు విచారించింది. ముగ్గురిపై సిట్ బృందం ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. వీరు ముగ్గురితోపాటు వివేకానంద‌రెడ్డి బావ మ‌రిది శివ‌ప్ర‌సాద్‌రెడ్డిని కూడా పోలీసులు విచారించారు.

సిట్ అధికారుల విచారణ అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చిన వివేకానంద‌రెడ్డి సోద‌రుడు ప్ర‌తాప్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో త‌మ‌కు ఎలాంటి అనుమానాలు లేవ‌ని మీడియా ముందు స్ప‌ష్టం చేశారు. రాజ‌కీయంగా చాలా మంది చాలా ర‌కాలుగా మాట్లాడుతుంటార‌ని, వాటన్నిటితో త‌మ‌కు సంబంధం లేద‌ని ప్ర‌తాప్‌రెడ్డి చెప్పారు.చిత్తూరు జిల్లాలో మైనింగ్‌కు సంబంధించి వివేకానంద‌రెడ్డి త‌మ ఇంటి ముందు ధ‌ర్నా చేసిన మాట వాస్త‌వ‌మేన‌ని, అయితే మైనింగ్ ఇష్యూకు, హ‌త్య‌కు ఎటువంటి సంబంధం లేద‌న్నారు.

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య జ‌రిగిన తీరును క‌డ‌ప ఎస్పీ రాహుల్‌దేవ్ శ‌ర్మ మీడియాకు వివ‌రించారు.వివేకానంద‌రెడ్డికి ముందు గుండెపోటు వ‌చ్చిన‌ట్లు కుటుంబ స‌భ్యులు గుర్తించార‌న్నారు. ఆ త‌రువాత బ్ల‌డ్ వామింగ్ అయిన‌ట్లుగా కుటుంబ స‌భ్యులు పోలీసులకు తెలిపార‌ని వెల్ల‌డించారు.

వివేకా హ‌త్య‌పై క్లారిటీ ఇచ్చిన ఎస్పీ..

అంతేకాకుండా, పోస్టుమార్టం నివేదిక‌లో వివేకానంద‌రెడ్డిది హ‌త్ యని తేలింద‌ని, శ‌రీరంపై ఉన్న తీవ్ర గాయాల‌ను కూడా గుర్తించామ‌న్నారు. వైఎస్ వివేకానంద‌రెడ్డి లేఖ ముందుగానే దొరికినా.. కుటుంబ స‌భ్యులు కొద్దిసేపు దాచిపెట్టార‌ని ఆయ‌న తెలిపారు. వివేకానంద‌రెడ్డి కుమార్తె స్పాట్‌కు చేరుకున్న త‌రువాత లేఖ‌ను బ‌హిర్గ‌త‌ప‌రిచార‌ని ఎస్పీ తెలిపారు. ఆ లేఖ ఎవ‌రు రాసి ఉంటారు…? అన్న కోణంలోనూ కేసు ద‌ర్యాప్తును వేగ‌వంతం చేసిన‌ట్లు ఎస్పీ తెలిపారు.