ఆ సీఐ నా భార్యను ఉంచుకుంటానన్నాడు : వైసీపీ ఎంపీ అభ్యర్ధి సురేష్

0
780

బాపట్ల వైసీపీ ఎంపీ అభ్యర్థి నందిగామ సురేష్ ఓ ప్రముఖ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు చెప్పారు. గతంలో బాపట్లలో భూములు తగలబడిన ఘటనలో నన్ను అన్యాయంగా ఇరికించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో పోలీసులు తనను స్టేషన్ కు కూడా తీసుకెళ్లినట్టు నందిగామ సురేష్ తెలిపారు.

పోలీస్ స్టేషన్ లో జరిగిన విషయాలను చెబుతూ నందిగామ సురేష్ కంటతడి పెట్టారు. తనను పోలీస్ స్టేషన్ కు తీసుకు రమ్మని చెప్పిన సీఐ చిట్టెం కోటేశ్వరరావు వైఎస్ జగన్ చెబితేనే భూములను తగలబెట్టినట్టు ఒప్పుకోమని తనపై ఒత్తిడి తెచ్చారని, కానీ తాను జగన్ పై అలా చెప్పేందుకు ఒప్పుకోలేదని నందిగామ సురేష్ తెలిపారు.

Read Also: TDP నేత మండవ వేంకటేశ్వర రావు ఇంటికెళ్ళిన KCR : TRSలోకి ఆహ్వానం..!

జగన్ పేరు చెప్పేందుకు నిరాకరించానని ఆగ్రహించిన సీఐ చిట్టెం కోటేశ్వరరావు నిన్ను చంపి నీ భార్యను నా దగ్గర పెట్టుకుంటానంటూ చాలా దారుణంగా మాట్లాడాడని, అటువంటి అవమానం తానూ జీవితంలో పడలేదని నందిగామ సురేష్ కంటతడి పెట్టారు.