శ్రీ‌శైలం దేవ‌స్థానంలో క్రిస్మ‌స్ వేడుక‌లు..!

0
204

శ్రీ‌శైలం దేవ‌స్థానంలో క్రిస్మ‌స్ వేడుక‌లు నిర్వ‌హించార‌ని ఉన్న‌తాధికారుల విచార‌ణ‌లో ఆధారాల‌తో స‌హా రుజువైంది. దీంతో బాధ్యులైన అధికారుల‌ను స‌స్పెన్ష‌న్ చేస్తూ ఉన్న‌తాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సంఘ‌ట‌న‌కు సంబంధించి శ్రీ‌శైలం దేవ‌స్థానం ఈవో శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

గ‌త ఏడాది డిసెంబ‌ర్ 25వ తేదీన శ్రీ‌శైలంలోని గంగాస‌ద‌న్‌పై ఆల‌య ఏఈవో మోహ‌న్ ఆధ్వ‌ర్యంలో క్రిస్మ‌స్ వేడుక‌లు జ‌రిగాయంటూ ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో దేవాదాయ‌శాఖ డిప్యూటీ క‌మిష‌న‌ర్ విచార‌ణ జ‌రిపార‌ని, ఆ విచార‌ణ‌లో ఏఈవో మోహ‌న్ క్రిస్మ‌స్ వేడుక‌లు నిర్వ‌హించిన‌ట్లు నిర్ధార‌ణ అయింద‌న్నారు. దేవాదాయ‌శాఖ డిప్యూటీ క‌మిష‌న‌ర్ నివేదిక ఆధారంగా ఏఈవో మోహ‌న్‌ను స‌స్పెండ్ చేస్తూ చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని ఈవో శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి తెలిపారు.

కాగా, గ‌తంలో ఆల‌యంలో క్షుద్ర‌పూజ‌లు చేస్తున్నార‌న్న స‌మాచారం బ‌య‌ట‌కు పొక్క‌డంతో పూజారిగా ప‌నిచేస్తున్న గంటి రాథాకృష్ణ‌ను స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇలా వ‌రుసగ క‌ల‌క‌లం సృష్టించే సంఘ‌ట‌న‌లు శ్రీ‌శైలం ఆల‌యంలో చోటుచేసుకుంటుండ‌టంతో భ‌క్తులు ఆందోళ‌న చెందుతున్నారు.