‘చిత్రలహరి’ మూవీ రివ్యూ ,రేటింగ్..!

0
460
chithralahari movie review

మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యానర్ పై కిషోర్ తిరుమ‌ల ద‌ర్శక‌త్వం వహిస్తున్న సినిమా ‘చిత్రలహరి’. ఈ సినిమాలో సాయిధ‌రమ్ తేజ్ , క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌, నివేతా పుతురాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రము న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్ నిర్మాణంలో రూపొందించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. వరుసగా ఆరు ప్లాప్ లతో ‘చిత్రలహరి’ విజయాన్ని అందించాలని నా పేరు విజయ్ అంటూ రంగంలోకి ఈరోజు దూకాడు. మరి ఎంత వరకు సక్సెస్ సాధించాడు.. ప్రేక్షకుల మదిని మెప్పించాడో.. చూద్దాం రండి.

ఈ సినిమా ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు విడుదలయ్యాయి. అక్కడ సినిమాను తిలకించిన వారంతా ట్విట్టర్ ద్వారా వారి వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. సాయి ధరమ్ తేజ్ హిట్ కోసం మళ్లీ ప్రయత్నించాల్సిందె అన్నట్లు చెప్పారు. ‘చిత్రలహరి’ చిత్రాన్ని ఒక్క సారి చూడొచ్చని అంటున్నారు.

ఫస్టాఫ్ ఎమోషన్స్, కామెడీ, డైలాగ్ లతో సాయి సూపర్ అనిపించుకున్నాడు. కానీ సెకండ్ హాఫ్‌ను దర్శకులు సాగదీశారని అభిప్రాయాన్ని వెల్లడించారు. సెకండాఫ్ లో సినిమా మొత్తం స్టోరీ మారిపోయిందని.. అది కూడా బాగుంటే సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యేదని ప్రేక్షకులు తెలిపారు. యావరేజ్ సినిమాగా టాక్ వచ్చింది.

మెగా అల్లుడు నటన చిత్రానికి ప్రధాన బలంగా చెప్పవచ్చు. తేజ్ ఈ సారి కొత్త లుక్‌ లో కనిపించాడు. సునీల్‌ తన కామెడీ, వెన్నెల కిషోర్ ఎప్పటిలాగే కడుపుబ్బా నవ్వించారట. పోసాని క్రిష్ణమురళి పాత్ర అదిరిపోయిందట. అద్భుతంగా చేశారట ఆయన. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌ అందముతో, నివేతా పుతురాజ్ అభినయముతో ఆకట్టుకున్నారు. ఇక మరి మన తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో మరి కొద్దీ సేపట్లో తెలియనుంది.

Rating: 1.5/5.