బిగ్ బ్రేకింగ్ : మెగాస్టార్ చిరంజీవికి మోడీ బంప‌ర్ ఆఫ‌ర్‌..!

0
213

టాలీవుడ్ అగ్ర న‌టుడు, మెగాస్టార్ చిరంజీవి బీజేపీలో చేర‌నున్నారా..? ఆ దిశ‌గా పార్టీ అగ్ర‌నేత‌లు ఆయ‌న‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు అవునంటూ ఇటీవ‌ల ప‌లు క‌థ‌నాలు సోష‌ల్ మీడియా వేదిక‌గా వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. బీజేపీ నేత‌లు సైతం ఆ క‌థ‌నాల‌ను స్వాగ‌తిస్తున్నారు.

మాజీ మంత్రి మాణిక్యాల వ‌ర‌ప్ర‌సాద్‌రావు సైతం ఏకంగా మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి చిరంజీవి బీజేపీలో చేరితే రెడ్ కార్పెట్ వేస్తామ‌ని, దివంగ‌త సీఎం ఎన్టీఆర్ త‌రువాత అంత‌టి ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నేత‌గా చిరంజీవికి పేరుందంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు కూడాను. దీంతో అప్ప‌టి వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న క‌థ‌నాల‌కు బ‌లం చేకూరిన‌ట్ట‌యింది. ఇంత‌కీ మెగాస్టార్ చిరంజీవికి మోడీ ఇచ్చిన ఆ బంప‌ర్ ఆఫ‌ర్ ఏమిటి..? అన్న ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు విశ్వ‌నాథ్ త‌నదైన శైలిలో విశ్లేషించారు.