చింత‌మ‌నేని కామెంట్స్.. టీడీపీ – వైసీపీ మ‌ధ్య వార్‌..!

0
98

దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా కాక‌పుట్టిస్తున్నాయి. అయితే, ద‌ళితుల‌ను అవ‌మానించారంటూ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మాట్లాడిన వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన వైసీపీ ఏలూరులో ఆందోళ‌న చేప‌ట్టింది. చింత‌మ‌నేని ప్ర‌భాకర్‌కు ద‌ళితులంటే గౌర‌వం లేదంటూ నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ ఏలూరులోని అంబేద్క‌ర్ విగ్ర‌హానికి వైసీపీ నేత‌లు పాలాభిషేకం చేశారు. చింత‌మ‌నేనిని స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. మ‌రోవైపు చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇదే విష‌య‌మై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ.. చింత‌మ‌నేనిలో కుల దురహంకారాన్ని సీఎం చంద్ర‌బాబు నాయుడు పెంచిపోషిస్తున్నారని అన్నారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే ద‌ళితుల‌ను అవ‌మానిస్తుంటే చంద్ర‌బాబు ఎందుకు ఖండించ‌ర‌ని ప్ర‌శ్నించారు. అంత‌కు ముందు త‌హ‌శీల్దార్ వ‌నజాక్షి విష‌యంలోనూ చంద్ర‌బాబు మౌనం వ‌హించ‌డం స‌మాజానికే సిగ్గుచేట‌న్నారు. అప్పుడే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకుని ఉంటే నేడు ద‌ళితుల‌పై ఇలా కుల‌హంకార వ్యాఖ్య‌లు చేసి ఉండేవారు కాద‌న్నారు.