చింత‌ల‌పూడి రిపోర్ట్ : సీన్ రివ‌ర్స్ – పీత‌ల సుజాత వ‌ర్గం ఫుల్ హ్యాప్పీ..?

0
342

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో రాజ‌కీయ‌ప‌రంగా కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టిగా చింత‌ల‌పూడి ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పీత‌ల సుజాత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, ఈ ద‌ఫా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆమెకు టికెట్ ఇవ్వ‌కుండా క‌ర్రా రాజారావుకు టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది.

టికెట్ కేటాయింపు వ్య‌వ‌హారంలో ఎంపీ మాగంటి బాబు వ‌ర్గం పీత‌ల సుజాత‌కు టికెట్ కేటాయించ‌కుండా ఉండేందుకు పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చింద‌ని రాజ‌కీయ వ‌ర్గాల వినికిడి. చింత‌ల‌పూడి మార్కెటింగ్ చైర్మ‌న్ విషయంలో మాగంటితో ఢీకొన్న పీత‌ల సుజాత‌పై ప‌లువురు మండ‌ల‌స్థాయి నేత‌లు క‌త్తిక‌ట్టిన‌ట్టు తెలుస్తుంది. ఆమెకు టికెట్ ఇవ్వొద్ద‌ని అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చారు.

ఇలా ఇద్ద‌రి మ‌ధ్య మినీ యుద్ధం జ‌రుగుతున్న తరుణంలో చింత‌ల‌పూడి టీడీపీ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది. పీత‌ల సుజాత ప్ర‌చారం చేస్తే ఫ‌లితం లేద‌ని చెప్ప‌డంతో క‌నీసం అటువైపు వెళ్లేందుకు కూడా ప్ర‌య‌త్నించ‌లేదు. పీత‌ల సుజాత వెనుక‌నున్న కొంత మంది నేత‌లు టీడీపీని వీడి వైసీపీలో చేరారు.ఇలా ప‌ట్టుబ‌ట్టి మ‌రీ టికెట్ తెచ్చుకున్న మాగంటి బాబు వ‌ర్గం, ఫ‌లితాల త‌రువాత సీన్ రివర్స్ అయితే ఏం చేయాల‌న్న‌దానిపై చ‌ర్చ‌ల‌ను ప్రారంభించిన‌ట్టు తెలుస్తుంది.