కోల్‌క‌తాను చిత్తు చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్‌..!

http://www.sumantv.com/chennai-super-kings/

0
185

చెన్నై సూప‌ర్ కింగ్స్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ను చిత్తు.. చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి బ‌రిలోకి దిగిన కోల్‌క‌తా నైట్ రైడర్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్‌లు కోల్పోయి 161 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ క్రిస్‌లిన్ మంచి ఆరంభాన్ని అందించాడు. మ‌రోసారి చెల‌రేగిన క్రిస్‌గేల్ 51 బంతుల్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్స్‌ల‌తో 81 ప‌రుగులు చేశాడు. కెప్టెన్ దినేష్ కార్తీక్ 18 ప‌రుగులు చేయ‌గా, నితీష్ రానా 21 ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌నిపించాడు. అయితే, మిగిలిన బ్యాట్స్‌మెన్స్ ఎవ‌రూ పెద్ద‌గా రాణించ‌లేక‌పోవ‌డంతో కోల్‌క‌తా భారీ స్కోరు చేయ‌లేక‌పోయింది. నాలుగు వికెట్‌లు తీసిన ఇమ్రాన్ తాహీర్ కోల్‌క‌తా జోరుకు బ్రేకులు వేశాడు. శార్దూల్ ఠాకూర్‌కు రెండు వికెట్‌లు ద‌క్క‌గా, శాంటినో ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

162 ప‌రుగుల‌తో బ‌రిలోకి దిగిన చెన్నై మొద‌ట్లో త‌డ‌బ‌డి వాట్స‌న్ వికెట్‌ను చేజార్చుకుంది. అయితే డుప్లిసిస్ కుదురుకుని మంచి ఆరంభాన్ని అందించాడు. ఆ త‌రువాత సురేష్ రైనా, కేదార్ జాద‌వ్‌తో క‌లిసి జ‌ట్టు స్కోరును ప‌రుగులు పెట్టించాడు. 20 ప‌రుగులు చేసిన కేదార్ జాద‌వ్ కొద్ది సేప‌టికే చావెల్ బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరారు. 81 ప‌రుగుల‌కే నాలుగు వికెట్‌లు కోల్పోయిన సూప‌ర్ కింగ్స్‌ను సురేష్ రైనా, ధోని క‌లిసి ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు. చివ‌ర్లో ర‌వీంద్ర జ‌డేజా బౌండ‌రీల‌తో విరుచుకుప‌డ‌టంతో ర‌న్ రేట్ త‌గ్గుతూ వ‌చ్చింది. హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్న రైనా చెన్నైకు సునాయాజ విజ‌యాన్ని అందించారు. రైనా 42 బంతుల్లో 58 ప‌రుగులు చేయ‌గా, జ‌డేజా 17 బంతుల్లోనే 31 ప‌రుగుల‌తో చెల‌రేగిపోయాడు. కోల్‌క‌తా బౌల‌ర్‌ల‌లో చాహ‌ల్, న‌రేన్ చెరో రెండు వికెట్‌లు తీయ‌గా, గున్నె ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.