కమల్ హాసన్ పై చెప్పుతో దాడి

0
27

సినీ నటుడు, ‘మక్కల్‌ నీది మయ్యం’ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ మీద చెప్పు దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాట ర్యాలీలో పాల్గొన్న కమల్ మీద ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. అయితే, అది ఆయన పక్క నుంచి వెళ్లింది. ఈ ఘటనను చూసిన మరికొందరు సైతం కమల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, చెప్పులు విసిరే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు, కమల్ చుట్టూ రక్షణగా నిలబడి అడ్డుకున్నారు. ఈ ఘటనపై కొందరు బీజేపీ కార్యకర్తలతో పాటు హనుమ సేన కార్యకర్తలపైనా కేసు నమోదైంది.

స్వతంత్ర భారతావనిలో తొలి ఉగ్రవాది హిందువేనంటూ మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేని ఉద్దేశించి కమల్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కమల్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హిందూ సంఘాల కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. కాగా కమల్ మాటలు దేశ వ్యాప్తంగా పెను దుమారాన్నే రేపాయి.