ఛానెల్ డిబేట్‌లో కొట్టుకున్న రాజ‌కీయ నేత‌లు..!

0
47

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఒక జాతీయ టీవీ ఛానెల్ నిర్వ‌హించిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో ఇద్ద‌రు నేత‌లు ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఆ గొడ‌వంతా లైవ్ టెలికాస్ట్ అవుతున్న‌ప్ప‌టికీ ఆ ఇద్ద‌రు నేత‌లు ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు. నెయిడా సెక్టార్ 16లోని ఒక న్యూస్ ఛానెల్ స్టూడియోలో ఈ గొడ‌వ జ‌రిగింది.

బీజేపీ నేత గౌర‌వ్ భాటియా, స‌మాజ్ వాదీ పార్టీ అధికార ప్ర‌తినిధి అనురాగ్ బ‌డోరియా పాల్గొన్న ఈ చ‌ర్చ‌లో ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. ఆ గొడ‌వ కాస్తా పెద్ద‌దిగా మారింది. చివ‌ర‌కు చేయి చేసుకునే వ‌ర‌కు వెళ్లింది.

బీఎస్పీ నేత అనురాగ్ బ‌డోరియా బీజేపీ నేత గౌర‌వ్ భాటియాను నెట్ట‌డంతో ఈ గొడ‌వ ప్రారంభ‌మైంది. బీజేపీ నేత కూడా త‌గ్గ‌కుండా బీఎస్పీ నేత‌పై చేయి చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. ఈ ఘ‌ట‌న త‌రువాత బీజేపీ నేత ఫిర్యాదు మేర‌కు బీఎస్పీ నేత అనురాగ్ బ‌డోరియాను పోలీసులు నిర్బంధించారు.

చానెల్ నిర్వ‌మించిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో బ‌డోరియా త‌న‌పై చేయి చేసుకున్నాడ‌ని, దుర్భాష‌లాడాడ‌ని బాటియా పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా, ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను సైతం పోలీసుల‌కు అందించారు. అనురాగ్ బ‌డోరియాను నిర్బంధంలోకి తీసుకోవ‌డంతో బీఎస్పీ ఎంపీ సురేంద్ర‌సింగ్ నేతృత్వంలో కొంత‌మంది కార్య‌క‌ర్త‌లు పోలీసు స్టేష‌న్ ఎదుట బైఠాయించారు. బ‌డోరియాను విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.