చంద్ర‌యాన్ -2 హైలెట్స్ ఇవే..!

0
1717

ప్ర‌ప‌పంచంలోని స్పేస్ టెక్నాల‌జీని గ‌మ‌నిస్తున్న అనేక దేశాల దృష్టి ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని శ్రీ‌హ‌రికోట షార్ కేంద్రంపై ప‌డింది. భార‌త్ శాస్త్ర‌వేత్త‌లు ఎన్నో ఏళ్ల క‌ష్టం చంద్ర‌యాన్ -2 కాసేప‌టి క్రిత‌మే విజ‌య‌వంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. నిజానికి ఈ నెల 15వ తేదీన చంద్ర‌యాన్ 2ను ప్ర‌యోగించాల్సి ఉన్నా థ‌ర్డ్ స్టేజ్‌లో 56వ నిమిషం ముందు సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో ప్ర‌యోగాన్ని ఈ రోజుకి వాయిదా వేశారు. ఛాలెంజ్‌గా తీసుకున్న శాస్త్ర‌వేత్త‌లు 2 గంట‌ల 43 నిమిషాల వ‌ద్ద చంద్ర‌యాన్ -2ను విజ‌య‌వంతంగా నింగిలోకి పంపారు.

చంద్ర‌యాన్ – 2 హైలెట్స్ ఇలా ఉన్నాయి..
– రోద‌సిలోకి వెళ్ల‌నున్న 3.8 ట‌న్నుల ఉప గ్ర‌హం
– చంద్రుడికి వంద కి.మీ దూరంలో క‌క్ష్య‌లో తిర‌గ‌నున్న ఆర్బిటార్
– చంద్రుడిపై దిగ‌నున్న ల్యాడ‌ర్, రోవ‌ర్‌లు,
– చంద్ర‌యాన్ -2 ఖ‌ర్చు రూ.978 కోట్లు
– శాస్త్ర‌వేత్త‌లో 30 శాతం మంది మ‌హిళ‌లే
– 17 రోజుల‌పాటు చంద్రునివైపు ప్ర‌యాణం చేస్తూ వెళ్తుంది.
– 28 రోజులపాటు చంద్రుని చుట్టూ తిరిగేందుకు స‌మ‌యం తీసుకుంటుంది.
– 180 కిలోమీట‌ర్లు వెళ్లిన త‌రువాత మాడ్యూల్ మాత్ర‌మే ప్ర‌యాణం చేస్తుంది.