సీఎం ప‌ద‌వికి చంద్ర‌బాబు రాజీనామా

0
271

తుక్కుతుక్కుగా ఓడిపోయిన నేప‌థ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి టీడీపీ అధినేత చంద్రబాబు రాజీనామా చేశారు. చంద్రబాబు రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో త‌మ పార్టీ ప‌రాజ‌యం పాల‌వ‌డంతో చంద్రబాబు త‌న రాజీనామా స‌మ‌ర్పించారు. ఏపీకి చంద్రబాబు చేసిన సేవలకు గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. తదుపరి ఏర్పాట్లు జరిగే వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని బాబును కోరారు. చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు.