వివేకా హత్య చేసిన వారికి ఎన్నికల అధికారులు సపోర్ట్ చేస్తున్నారు : చంద్రబాబు

0
140
వివేకా హత్య చేసిన వారికి ఎన్నికల అధికారులు సపోర్ట్ చేస్తున్నారు : చంద్రబాబు
వివేకా హత్య చేసిన వారికి ఎన్నికల అధికారులు సపోర్ట్ చేస్తున్నారు : చంద్రబాబు

రాష్ట్రంలోని ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత, CM చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ ముందు ధర్నాకు దిగారు. ఇందులో బాగంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదిని కలిసిన చంద్రబాబు.. ఈసీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సీఈవోకు వినతి పత్రం అందజేశారు. సుదీర్గ చర్చల అనంతరం మీడియా ముందుకు వచ్చిన ఆయన.. ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు.

ఈ సందర్భంగా మాట్లాడినా చంద్రబాబు.. దేశంలోని 22 పార్టీలు EVM లపై ECకి ఫిర్యాదు చేశాయి. బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాం అని తెలిపారు. ఈ సందర్భంగా మరోసారి YS వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడినా చంద్రబాబు.. ఎన్నికల అధికారులు వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారికి సపోర్ట్ చేస్తుందని.. వాళ్ళు ఎలా ఆడమంటే అలా ఆడుతుందని.. ఇది చాలా దుర్మార్గం అని నిలదీశారు చంద్రబాబు.