వైరాగ్యంలో చంద్రబాబు. !

0
263

2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల విడుదల తేదీ దగ్గరపడుతున్న వేళ టి‌డి‌పి అధినేత చంద్రబాబు లో సరికొత్త ధోరణి కనిపిస్తోంది. అభివృద్ధి, నిరంతర శ్రమ అంటూ తరచూ మాట్లాడే చంద్రబాబు ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుతున్నారు.’ధర్మాన్ని మనం కాపాడాం, ఇప్పుడా ధర్మమే మనల్ని కాపాడుతుంది’ అని చంద్రబాబు అమరావతిలో ప్రవాసాంధ్రులతో ప్రత్యేక భేటీ సందర్భంగా వ్యాఖ్యానించారు.

రాష్ట్రం కోసం ధర్మపోరాటం చేశామన్నారు. జన్మభూమి-మా ఊరు వంటి కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రులు గణనీయమైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. భవిష్యత్ లోనూ రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు.

జేఈఈ మెయిన్స్ లో తొలి నాలుగు ర్యాంకులు తెలుగువారికి దక్కడంపై హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు, రాబోయే 15 ఏళ్లలో తెలుగుజాతి ప్రపంచంలోనే సాటిలేనిదిగా ఎదగాలన్నది తన అభిమతమన్నారు. ఎక్కడ, ఏ రంగంలో అవకాశం ఉన్నా అక్కడ ఆంధ్రులను ప్రోత్సహించాలని ఎన్నారైలకు చంద్రబాబు సూచించారు.