రామోజీరావుతో సీఎం చంద్ర‌బాబు భేటీ – చ‌ర్చ‌కు వ‌చ్చిన అంశాలు ఇవే..!

0
498

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుతో దాదాపు అర్ధ‌గంట‌పాటు ఏకాంత భేటీ అయ్యారు. కాగా, రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ రోజు జ‌ర‌గ‌నున్న ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు సీఎం చంద్ర‌బాబు కాసేప‌టి క్రితం హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ఫిల్మ్‌సిటీకి చేరుకున్న చంద్ర‌బాబు రామోజీరావుతో సుమారు అర్ధ‌గంట‌పాటు ఏకాంత భేటీ అయ్యారు.

అయితే, ఇటీవ‌ల కాలంలో రామోజీరావు అనారోగ్య కార‌ణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స‌మయంలో సీఎం చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత ఇద్ద‌రు భేటీ కావ‌డం ఇదే తొలిసారి. వీరి భేటీలో ప్ర‌స్తుతం ఏపీ, దేశంలో చోటు చేసుకున్న రాజ‌కీయ అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. ఫిల్మ్‌సిటీలో కార్య‌క్ర‌మం ముగిసిన వెంటనే సీఎం చంద్ర‌బాబు తిరిగి అమ‌రావ‌తికి బ‌య‌ల్దేర‌నున్నారు.