న‌వ్వులు చిందించిన చంద్ర‌బాబు..!

0
202

టీడీపీ జాతీయ అధ్య‌క్షులు, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా మ‌రోసారి న‌వ్వులు చిందించారు. అయితే నిత్యం రాజ‌కీయ కార్య‌క్ర‌మాల‌తో క్ష‌ణం తీరిక‌లేకుండా ఉండే చంద్ర‌బాబు మోముపై న‌వ్వులు న‌వ్వులు పూయ‌డం అరుదైన స‌న్నివేశ‌మేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులుసైతం చెబుతున్నారు. ఇంత‌కీ సీఎం చంద్ర‌బాబు అంత‌లా న‌వ్వులు పూయించ‌డానికి గ‌ల కార‌ణాలేంటి..? అన్న విష‌యానికొస్తే..!

ఈ రోజు జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ అధికార‌పార్టీ స‌భ్యుల‌కు ఎక్కువ స‌మ‌యం కేటాయించ‌డం స‌బ‌బే అయినా, వారు త‌మ‌పై చేసిన ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం ఇచ్చే అవ‌కాశం ప్ర‌తిప‌క్షానికి ఇవ్వ‌క‌పోవ‌డాన్ని చంద్ర‌బాబు త‌ప్పుబ‌ట్టారు.

చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌కు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కౌంట‌ర్ ఇస్తూ గ‌తంలో త‌మ పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో చంద్ర‌బాబు ఎన్నిసార్లు వైసీపీ స‌భ్యుల‌కు అవ‌కాశం ఇచ్చారో చెప్పాల‌ని, వైసీపీ స‌భ్యులకు మాట్లాడే అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తి సంద‌ర్భంలోనూ చంద్ర‌బాబు త‌మ పార్టీ స‌భ్యుల‌ను మాట్లాడాలంటూ ఉసిగొల్పి పైకిలేపేవాడి, ఇలా అడుగ‌డుగునా వైసీపీ స‌భ్యుల‌కు అడ్డుప‌డి దివంగ‌త సీఎం వైఎస్ఆర్‌పై విమ‌ర్శ‌లు చేసేవార‌ని గుర్తు చేశారు.

అనంత‌రం మైక్ అందుకున్న చంద్ర‌బాబు టీడీపీ అధికారంలో ఉండ‌గా, తాను ప్ర‌తిప‌క్ష వైసీపీ స‌భ్యుల‌కు అడ్డుప‌డుతూ టీడీపీ స‌భ్యుల‌ను మాట్లాడాలంటూ ఉసిగొల్పానంటూ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి చెప్ప‌డం హాస్యాస్ప‌ద‌మ‌ని, కానీ ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో మాత్రం టీడీపీ స‌భ్యుల స‌మ‌యాన్ని వృధా చేసేందుకు సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి వైసీపీ స‌భ్యుల‌ను మాట్లాడాలంటూ ఉసిగొల్పుతున్నాడ‌ని, లెయ్యండీ.. లెయ్యండీ అంటూ సైగ‌లు చేస్తున్నాడు. మీరు చూడ్లా.. చూడ్లా.. కావాలంటే రికార్డు చూడండి.. లెయ్య‌క‌పోతే చూస్తున్నాడు.. జ‌గ‌న్ చూస్తేనే వైసీపీ స‌భ్యులు మాట్లాడేందుకు లేస్తున్నారు అంటూ హాస్య‌చ‌తుర‌తో చంద్రబాబు మాట్లాడారు.