జ‌గ‌న్ త‌న చెట్టును తానే న‌రుక్కుంటున్నాడు : చ‌ంద్ర‌బాబు

0
133

పోల‌వ‌రం ప్రాజెక్టుకు ఫైనాన్స్ క్లియ‌రెన్స్ రాకున్నా.. ఆర్ అండ్ ఆర్ రాష్ట్ర ప్ర‌భుత్వానిదేన‌ని వైసీపీ ఏమీ మాట్లాడ‌టం లేద‌ని మాజీ సీఎం చంద్ర‌బాబు అన్నారు. సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌న చెట్టును తానే న‌రుక్కుంటున్నాడ‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి సీబీఐ ద‌ర్యాప్తు కోరితే కేంద్ర ప్ర‌భుత్వం అవ‌స‌రం లేద‌ని చెప్పిన విష‌యాన్ని చంద్ర‌బాబు గుర్తు చేశారు.

ఈ రోజు మీడియాతో మాట్లాడిన చంద్ర‌బాబు.. త‌మ ప్ర‌భుత్వ హ‌యంలో పున‌రావాసంలో అవ‌క‌త‌వ‌క‌ల గురించి జీవీఎల్ ప్ర‌స్తావిస్తే.. పోల‌వ‌రానికి ఎంత ఇస్తార‌ని నాడు సీఎం ర‌మేష్ అడిగార‌ని చెప్పారు. వాళ్ల‌లో వాళ్ల‌కే పొంత‌న లేకుండా పోయింద‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. కియా ప‌రిశ్ర‌మను దివంగ‌త సీఎం వైఎస్ఆర్ తెచ్చార‌ని చెబుతున్నార‌ని, ప‌ట్టిసీమ నీళ్లు మ‌చిలీప‌ట్నంకు ఉప‌యోగ‌ప‌డ‌టం లేద‌ని వైసీపీ శ్రేణులు విమ‌ర్శించ‌డాన్ని చంద్ర‌బాబు తప్పుబట్టారు.