చ‌ంద్ర‌బాబు : 29 సార్లు ఢిల్లీకి వెళ్లా.. కానీ..!

0
86

ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం అధికార పార్టీకి అన్ని విధాలా స‌హ‌క‌రిస్తామ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అన్నారు. అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న తీరు చూస్తుంటే స్పీక‌ర్‌ను ప‌క్క‌నపెట్టి జ‌గ‌న్‌ న‌డిపిస్తున్న‌ట్టు ఉంద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

నాడు ప్ర‌త్యేక హోదాకు స‌మాన‌మైన ప్యాకేజీని ఇస్తామని కేంద్రం చెబితేనే ఒప్పుకున్నామ‌ని, కానీ హోదా పేరుపై నిధుల‌ను ఇచ్చేందుకు ఫైనాన్స్ క‌మిష‌న్ ఒప్పుకోలేదని చంద్ర‌బాబు త‌న ప్ర‌సంగం పేర్కొన్నారు. ఆ కార‌ణంగానే హోదా పేరును మార్చి ప్యాకేజీ ప్ర‌క‌టించార‌న్నారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న విష‌యంలో తాను రాజీప‌డ‌కుండా 29 సార్లు ఢిల్లీకి వెళ్లిన విష‌యాన్ని చంద్ర‌బాబు గుర్తు చేశారు.