చంద్రబాబు నరుకుడు..!

0
176

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ చెరోపక్క నరుక్కొస్తున్నారు. కేంద్రం లో చక్రం తిప్పేందుకు ఫెడరల్ ఫ్రంట్ అంటూ కే‌సి‌ఆర్ రంగం సిద్దం చేస్తుంటే, మరో తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు యూపీఏ అనుబంధ పార్టీ లతో మంతనాలు సాగిస్తున్నారు. ఇందులో భాగం గా ఇప్పుడు చంద్రబాబు మరో మారు ఢిల్లీ పర్యటన లో వున్న సంగతి తెలిసిందే.

చంద్రగిరి రీపోలింగ్ వ్యవహారంలో ఈసీ తీరు మీద అభ్యంతరాలు తెలిపేందుకు శుక్రవారం ఢిల్లీ వచ్చిన ఆయన.. అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరీలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుపై చర్చిచారు. ఇక ఇవాళ ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో చంద్రబాబు సమావేశం అవుతారు.

ఆపాయింట్మెంట్ దొరికితే యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ తోనూ సమావేశం అయ్యే అవకాశం వుంది. అనంతరం చంద్రబాబు లక్నో చేరుకుని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అవుతారు. ఆదివారం తిరిగి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళే అవకాశం వుంది.