పాలీష్ చేయ‌డంలో చంద్ర‌బాబు ఎక్స్‌ప‌ర్ట్‌ : ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

0
191

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎవ‌ర్ని ఎలా వాడుకోవాలో ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు తెలిసిన‌ట్లు మ‌రెవ్వ‌రికీ తెలియ‌ద‌ని, ఆ విష‌యంలో చంద్ర‌బాబు నాయుడు దాదాపు 40 సంవ‌త్స‌రాల అనుభ‌వాన్ని గ‌డించార‌ని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు విమ‌ర్శించారు. కాగా, ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు నాయుడు చేసే కుట్ర రాజ‌కీయాల‌కు మ‌రెవ్వ‌రూ కూడా సాటిరార‌న్నారు.

అలాగే, ఏపీలో ప్ర‌స్తుతం చంద్ర‌బాబు స‌ర్కార్ ఉందంటే అందుకు ప్ర‌ధాన కార‌ణం 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన పార్టీలేన‌న్నారు. అయితే, ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు బుద్ధి చెప్పి, టీడీపీని బంగాళాఖాతంలో క‌లిపేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌న్నారు. చంద్ర‌బాబు తాను సొంతంగా చేయించుకున్న స‌ర్వేల్లో టీడీపీ ఓట‌మి త‌ప్ప‌ద‌ని గ్ర‌హించి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో స్నేహం కోసం ఇప్ప‌ట్నుంచే పాలీష్ చేయ‌డం మొద‌లు పెట్టాడ‌ని ఎద్దేవ చేశారు.