జేడీఎస్ – కాంగ్రెస్ కూట‌మికి మ‌ద్ద‌తుగా చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారం..!

0
67

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు నేటి నుంచి క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల ప్ర‌చారానికి సిద్ధ‌మ‌య్యారు. జేడీఎస్‌, కాంగ్రెస్ కూట‌మికి మ‌ద్ద‌తుగా మండ్యాల‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖ‌రారైంది. బెంగ‌ళూరు సహా తెలుగు ప్ర‌జ‌లు ఎక్కువ‌గా నివ‌సిస్తున్న లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో ఏర్పాటు చేయ‌నున్న బ‌హిరంగ స‌భ‌ల్లో చంద్ర‌బాబు పాల్గొంటారు.

జేడీఎస్ చీఫ్, మాజీ ప్ర‌ధాన మంత్రి దేవెగౌడ‌, సీఎం కుమార‌స్వామితో క‌లిసి రోడ్ షోల‌ను నిర్వ‌హిస్తారు. ముందుగా ముఖ్య‌మంత్రి కుమారుడు నిఖిల్‌గౌడ పోటీ చేస్తున్న మాండ్యాలో బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబు పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీలో చాలాకాలంపాటు కొన‌సాగిన అంబ‌రీష్ గ‌త ఏడాది క‌న్నుమూశారు. అంబ‌రీష్ మాండ్యా నుంచి మూడుసార్లు లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్ క్యాబినేట్‌లో స‌హాయ మంత్రిగా ప‌నిచేశారు. అంబ‌రీష్ మ‌ర‌ణానంత‌రం ఆయ‌న కుటుంబానికి మాండ్యా లోక్‌స‌భ సీటును ఇవ్వ‌డానికి కాంగ్రెస్ నిరాక‌రించింది. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జేడీఎస్‌కు వ‌దులుకుంది.

జేడీఎస్ అభ్య‌ర్ధిగా త‌న కుమారుడు న‌టుడు నిఖిల్‌ను రంగంలోకి దింపాల‌ని కుమారస్వామి భావించారు. దీంతో సుమ‌ల‌త‌కు మ‌ద్ద‌తుగా మాండ్యా లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేయాల్సి వ‌చ్చింది. బీజేపీ ఆమెకు మ‌ద్ద‌తు ఇస్తుంది. తెలుగు ఓట‌ర్లు ఎక్కువ‌గా స్థిర‌ప‌డిన బ‌ల్లారి, బెంగ‌ళూరు, కోలార్ వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ అభ్య‌ర్ధుల గెలుపు కోసం చంద్ర‌బాబు ప్ర‌చారం చేసే అవ‌కాశాలు ఉన్నాయి.