కే‌సి‌ఆర్ చివరకు ఓడిపోయిన వాళ్ళను కూడా వదలడంలేదు : చంద్రబాబు

0
122
కే‌సి‌ఆర్ చివరకు ఓడిపోయిన వాళ్ళను కూడా వదలడంలేదు : చంద్రబాబు
కే‌సి‌ఆర్ చివరకు ఓడిపోయిన వాళ్ళను కూడా వదలడంలేదు : చంద్రబాబు

ఎన్నికల ప్రచారంలో భాగంగా AP సీఎం చంద్రబాబు మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు “రిటర్న్ గిఫ్ట్” ఇస్తా అని కే‌సి‌ఆర్ ఏరోజైతే అన్నాడో ఆరోజు నుండి బాబు కూడా కే‌సి‌ఆర్ కు “రిటర్న్ గిఫ్ట్” ఇస్తా అంటూ ప్రచారం ప్రారంభించాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కే‌సి‌ఆర్, చంద్రబాబును టార్గెట్ చేసి ఎలా అయితే గెలిచాడో, అదే పార్ములాను ఇప్పుడు బాబు కొనసాగిస్తున్నాడు.

అందులోబాగంగానే కే‌సి‌ఆర్ పై విమర్శలు చేస్తున్నాడు బాబు. కేసీఆర్ తన పార్టీలోకి కనిపించిన ప్రతి ఒక్కరినీ లాక్కుంటున్నారు.. చివరకు ఓడిపోయిన నేతలను కూడా వదలటం లేదని పరోక్షంగా “నామా నాగేశ్వరావు” చేరికను ఉద్దేశించి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో 175 సీట్లు గెలవడమే తమ లక్ష్యమని, అప్పుడే కోడికత్తి పార్టీ డ్రామాలను అరికట్టగలమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇదిలాఉంటే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని రేపు విడుదల చేయనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.