‘అభినేత్రి 2’ నుంచి ‘చక్కని పిల్ల’ లిరికల్ వీడియో సాంగ్..!

0
304
abhinethri 2
abhinethri 2

తమిళములో తమన్నా, ప్రభుదేవా జంటగా నటిస్తున్న చిత్రం ‘దేవి’. ఈ సినిమాను తెలుగులో ‘అభినేత్రి’ గా దర్శకుడు ఏఎల్ విజయ్ ప్రేక్షకులకు అందించాడు. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఈ మూవీకి సీక్వెల్ గా ‘దేవీ2’ తమిళంలో సిద్ధమవుతుండగా, తెలుగులో ‘అభినేత్రి 2’ గా మరో సారి ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కపోతుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా చిత్రం నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ రెలీజ్ చేశారు. ప్రభుదేవా సరసన తమన్నాతో పాటు, నందిత శ్వేతా నటిస్తుంది.

“చక్కని పిల్లా చక్కర బిళ్లా చిక్కని సోకుతో చంపొద్దే .. ” అంటూ కొనసాగే పాటలో ప్రభుదేవా , నందిత శ్వేతా మధ్య చిత్రీకరణ జరిగింది. ఫాస్ట్ బీట్ తో సాగుతున్న పాట మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 31వ తేదీన విడుదలకు సిద్దమవుతుంది. హార్రర్ థ్రిల్లర్ గా సాగే సినిమా తప్పకుండా భారీ విజయాన్ని అందుకుంటుందని నమ్ముతున్నారు చిత్ర యూనిట్.