బిగ్‌బాస్ -3పై కేసు న‌మోదు..!

0
173

బిగ్‌బాస్ – 3 ప్రారంభానికి ముందే వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా బిగ్‌బాస్ – 3పై కాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. మ‌హిళా సెల‌బ్రెటీతో బిగ్‌బాస్ నిర్వాహ‌కులు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించార‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఓ యువ‌తి మ‌రో అడుగు ముందుకేసింది. బిగ్‌బాస్ నిర్వాహ‌కుల‌పై కేసు పెట్ట‌డం క‌ల‌క‌లం రేపింది. బిగ్‌బాస్ షోలో పాల్గొనేందుకు అంటూ త‌న‌ను పిలిచి లైంగికంగా వేధించార‌ని ఆ యువ‌తి ఫిర్యాదులో తెలిపింది.

బిగ్‌బాస్ – 3 రియాల్టీ షోకు త‌న‌ను ఎంపిక చేశార‌ని, అయితే త‌న‌కు అగ్రిమెంట్‌మాత్రం ఇవ్వ‌లేద‌ని ఆ యువ‌తి చెప్పింది. అంతేకాకుండా బిగ్‌బాస్‌ను ఎలా సంతృప్తిప‌రుస్తారు..? అంటూ లైంగికంగా వేధించడం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే బిగ్‌బాస్ సీజ‌న్ 3 ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో షోకు సంబంధించి ప‌లువురి సెల‌బ్రెటీల ఎంపిక పూర్త‌యింది. ఇలాంటి స‌మ‌యంలో నిర్వాహ‌కులపై లంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు అల‌జ‌డి రేపుతున్నాయి.