కేసు న‌మోదు : వైఎస్ వివేకాంద‌రెడ్డి మృతిపై వెంటాడుతున్న అనుమానాలెన్నో..!!

0
198

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సోద‌రుడు, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ బాబాయ్ వైఎస్ వివేకానంద‌రెడ్డి ఇవాళ తెల్ల‌వారు జామున గుండెపోటుతో మృతి చెందారు. అయితే, వివేకానంద‌రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంపై ఆయ‌న పీఏ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. మృతి చెందిన వైఎస్ వివేకానంద‌రెడ్డి త‌ల‌కు గాయ‌మై ఉండ‌టంతో కృష్ణారెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో వివేకానంద‌రెడ్డిది అనుమానాస్ప‌ద మృతిగా పోలీసులు కేసు న‌మోదు చేశారు. వైఎస్ వివేకానంద‌రెడ్డి భౌతిక‌కాయానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వ‌హించ‌నున్నారు.

ఇవాళ తెల్ల‌వారుజామున వైఎస్ వివేకానంద‌రెడ్డి మృతి చెందిన విష‌యాన్ని గుర్తించిన త‌రువాత ఆయ‌న మంచం ద‌గ్గ‌ర, బాత్‌రూమ్‌లో కూడా రక్తం ఉండ‌టాన్ని గ‌మ‌నించాని పీఏ కృష్ణారెడ్డి పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు స‌మాచారం. అంతేకాక‌, వివేకానంద‌రెడ్డి త‌న మంచం ద‌గ్గ‌ర కానీ, లేక బాత్‌రూమ్‌లోకానీ బ్ల‌డ్ వాంతింగ్ చేసుకున్న‌డా..? లేక గుండెపోటు వ‌చ్చిందా..? లేక మ‌రేమైనా జ‌రిగిందా..? అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. మ‌రోప‌క్క త‌ల‌కు గాయమై ఉండ‌టంతో పోలీసులు కేసును మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు.

వైఎస్ వివేకానంద‌రెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థానం..

వైఎస్ వివేకానంద‌రెడ్డి 1950 ఆగ‌స్టు 8న క‌డ‌ప జిల్లా పులివెందుల‌లో జ‌న్మించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అగ్రిక‌ల్చర్ నుంచి వ్య‌వ‌సాయంలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన వైఎస్ వివేకానంద‌రెడ్డి వైఎస్ఆర్ సోద‌రుడిగా ఆయ‌న‌కు రాజ‌కీయంగా అండ‌గా ఉన్నారు. 1989 – 1994లో క‌డ‌ప జిల్లా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హించారు. 1999 – 2004లో క‌డ‌ప ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హించారు. 2004 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో క‌డ‌ప స్థానం నుంచి ల‌క్షా 10 వేల మెజార్టీతో గెలుపొందారు. 2009లో ఏపీ శాస‌న‌స‌భ స‌భ్యుడిగా ఎన్నికైన వివేకానంద‌రెడ్డి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కిర‌ణ్‌కుమార్‌రెడ్డి వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రిగా కూడా ప‌నిచేశారు. 2011లో క‌డ‌ప‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో వ‌దిన వైఎస్ విజ‌య‌మ్మ‌పై పోటీచేసి ఓడిపోయారు.