బిగ్ బ్రేకింగ్ : అంబ‌టి రాంబాబు స‌హా ముగ్గురు వైసీపీ నేత‌లపై కేసు..!

0
393

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా స‌త్తెన‌ప‌ల్లి ఇనిమెట్ల గ్రామంలో అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావుపైదాడి కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్య‌ర్ధి అంబ‌టి రాంబాబుతో స‌హా ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేత‌ల‌పై కేసు న‌మోదైంది. అయితే, అంత‌కు ముందు స‌త్తెన‌ప‌ల్లి వైసీపీ నేత‌లు కోడెల శివ‌ప్ర‌సాద్‌పై కుట్ర ప‌న్నార‌ని ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాది పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే.

కోడెల‌పై దాడికి సంబంధించి ఫిర్యాదు అందిన నేప‌థ్యంలో ఇనిమెట్ల‌లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. కోడెల‌పై దాడి కేసు విచార‌ణ‌లో భాగంగా ఇప్ప‌టికే ప‌దిమందిని అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. మ‌రోప‌క్క గ్రామ‌స్తులు ఇళ్ల‌కు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు.

స‌త్తెన‌ప‌ల్లి పోలీసులు మీడియాతో మాట్లాడుతూ స్పీక‌ర్ కోడెల శివ ప్ర‌సాద్‌రావు పోలింగ్ బూత్ వ‌ద్ద‌కు వ‌చ్చే క్ర‌మంలో కొంత మంది అల్ల‌రి మూక‌లు, పోలీసు సిబ్బంది, స్పీక‌ర్‌పై అటాక్ చేశార‌ని, ఆ అటాక్ సంద‌ర్భంగా పోలీసు ఫోర్స్‌కు కూడా దెబ్బ‌లు త‌గిలాయ‌ని తెలిపారు. వైసీపీ త‌రుపున కంటెస్ట్ చేస్తున్న అంబ‌టి రాంబాబు, ఆదినారాయ‌ణ మ‌రో ఇద్ద‌రు ప్రోత్స‌హించ‌డంతోనే అక్క‌డ కొంత మంది అల్ల‌రి మూక‌లు స్పీక‌ర్ కోడెల‌పై దాడి చేసేందుకు ప్ర‌య‌త్నిచి కొట్టారని, ఆమేర‌కు రిపోర్టు కూడా రిజిస్ట‌ర్ అయిందని చెప్పారు.

అయితే, కోడెల త‌రుపు న్యాయ‌వాది ఇచ్చిన ఫిర్యాదులో ఎంత వ‌ర‌కు నిజం ఉంది..? అన్న‌ది త‌మ విచార‌ణ‌లో తేలాల్సి ఉంద‌ని, ఇప్ప‌టికే ఇనిమెట్ల గ్రామంలో చోటు చేసుకున్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు సంబంధించి విజువ‌ల్ క్లిప్పింగ్స్‌ను కూడా సేక‌రించి ప‌రిశీలిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు.