మల్లి సొంత గూటికి : వైసీపీలోకి బుట్టా రేణుక

0
157
మల్లి సొంత గూటికి : వైసీపీలోకి బుట్టా రేణుక
మల్లి సొంత గూటికి : వైసీపీలోకి బుట్టా రేణుక

2014 ఎన్నికల్లో YSRCP పార్టీ తరుపున గెలిచిన బుట్టా రేణుక, మాగుంటా కేవలం కొన్నిసీట్ల తేడాతో వెనకబడ్డ జగన్మోహన్ రెడ్డిని కాదని… నాడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి మాటలు విని TDPలోకి జంప్ అయ్యింది. ఇన్నాళ్ళు TDPలోనే కొనసాగిన బుట్టా రేణుక ఈరోజే మళ్ళీ సొంత గూటికి చేరింది. YCP అధ్యక్షుడు జగన్ సమక్షంలో మరోసారి YCP కండువా కప్పుకున్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు.

నేను చేసిన తప్పు తెలుసుకున్నాను.. చంద్రబాబు నాకు నరకం చూపించారు. నాకే కాదు ఇక్కడున్న ఎవ్వరికీ ఎలాంటి మర్యాద ఇవ్వరు.. అంతా వల్లే చేస్తారు.. TDPలో చేరిన 14 నెలలకే నాకు అర్దం అయ్యింది. ఈ 5 ఏళ్లలో YCP కి, TDP కి ఉన్న తేడా తెలుసుకున్నాను. నేను ఏం కోల్పోయానో అర్దం అయ్యింది. నేను చేసిన తప్పుకు శిక్ష కూడా అనుభవించాను.. ఆ తరువాతే ఇప్పుడు నాకు ఇష్టం అయిన YSRCPలో చేరుతున్నాను అంటూ బుట్టా రేణుక మీడియాకు వివరించింది. TDPలో సీటు ఎవ్వలేదని ఇక్కడికి రాలేదు.. కేవలం అక్కడ మర్యాద లేకపోవడం వల్లే YCPలో చేరాను అని చెప్పిన బుట్టా రేణుక.. ఎలాంటి షరతులు లేకుండానే YCPలో చేరానని వివరణ ఇచ్చారు.